రాష్ట్రంలో 94 సివిల్ జడ్జ్ పోస్టులు
Civil Judge posts:
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు.. 94 సివిల్ జడ్జి పోస్టుల (జూనియర్ డివిజన్) భర్తీ చేయనున్నారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 66 పోస్టులు.. ట్రాన్స్ఫర్ ద్వారా 28 పోస్టులు భర్తీ చేస్తారు.
స్క్రీనింగ్ టెస్ట్, రాత పరీక్ష , వైవా-వోస్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఎంపికైన వారికి నెలకు వేతనం రూ. 77,840- రూ.1,36,520 వరకు ఉంటుంది.
దరఖాస్తులను ఈ నెల 29వ తేదీ లోపు పంపించాల్సి ఉంది. దరఖాస్తు ఫీజు రూ. 1,250. ఇడబ్ల్యుఎస్/ పిడబ్ల్యుబిడి/ ఎస్టి/ ఎస్సి అభ్యర్థులకు రూ. 600గా ఉంది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 23 నుండి 35 ఏళ్ల మధ్య ఉండాలి. లా డిగ్రీతో పాటు, బార్ కౌన్సిల్ లో అడ్వకేట్‌గా నమోదు చేసి ఉండాలి. మూడు సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో లేదా దాని నియంత్రణలో పనిచేసే కోర్టులలో అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేసి ఉండాలి.
హైదరాబాద్ వరంగల్, కరీంనగర్ , ఖమ్మం లలో పరీక్ష నిర్వహిస్తారు.
[…] రాష్ట్రంలో 94 సివిల్ జడ్జ్ పోస్టులు […]
[…] రాష్ట్రంలో 94 సివిల్ జడ్జ్ పోస్టులు […]