రాష్ట్రంలో పెట్టుబుడులు పెట్టేందుకు ముందుకొచ్చిన కంపెనీలు

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ రెండో రోజు కొన‌సాగింది. ఈ సంద‌ర్బంగా రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు దేశ, విదేశాల‌కు చెందిన వివిధ కంపెనీలు ముందుకొచ్చాయి. వివిధ కంపెనీల ప్ర‌తినిధులు తెలంగాణ ప్ర‌భుత్వంలో ఎంఒయులు కుదుర్చుకున్నారు.

గోద్రెజ్ జెర్సీ సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మ‌న్ ఫిరోజ్ షా గోద్రెజ్‌, గ్రూప్ ప్రెసిడెంట్ రాకేశ్ స్వామితో సిఎం స‌మావేశమ‌య్యారు. న‌గ‌రంలో సంస్థ విస్త‌రణ‌పై సిఎం తో చ‌ర్చించారు. మ‌రోవైపు సుమ‌ధుర గ్రూప్‌, టిసిసిఐ తైవాన్ గ్రూప్ కూడా స‌మావేశ‌మ‌య్యారు. అదేవిధంగా భార‌త్ బ‌యోటిక్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ .. కాంట్రాక్ట్ రీసెర్చ్‌, డెవ‌ల‌ప్‌మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చ‌రింగ్ ఆర్గ‌నైజేష‌న్ నిర్మాణానికి రూ.1000 కోట్లు పెట్టుబ‌డి పెట్ట‌నుంది. 200మందికి పైగా ఉద్యోగావ‌కాశాలు రానున్నాయి. రాష్ట్ర ప్ర‌భుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.

రూ.2వేల కోట్ల పెట్టుబ‌డితో పుడ‌డ్ అండ్ అగ్రిక‌ల్చ‌ర్ ఆర్‌డి సెంట‌ర్ నిర్మించేందుకు ఫెర్టిస్ ఇండియా ముందుకొచ్చింది.

పుడ్ అండ్ బేవ‌రేజెస్ యూనిట -2 విస్త‌రణ‌కు కెజెఎస్ ఇండియా రాష్ట్ర స‌ర్కార్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

వింటేజ్ కాఫీ అండ్ బేవ‌రేజెస్.. ఫ్రీజ్ డ్రైడ్ కాఫీ ప్లాంట్ నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకుంది.

కైన్స్ టెక్నాల‌జి.. ఎల‌క్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మ్యాన్యుఫాక్చ‌రింగ్ సేవ‌ల విస్తర‌ణ‌కు ఒప్పందం కుదుర్చుకుంది.
ఫుడ్ అండ్ ఎఫ్ ఎంసిజి త‌యారీ యూనిట్‌కు ఆర్‌సిపిఎల్ తో , జెసికే ఇన్‌ఫ్రాతో రూ. 9వేల కోట్లు పెట్టుబ‌డి పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.

రూ. 70వేల కోట్లు పెట్టుబ‌డి పెట్టుబ‌డి పెట్టేందుకు ఎఐ-రెడీ డేటా పార్క్ , రూ. 2వేల కోట్టు పెట్టుబ‌డి తో అర‌బిందో ఫార్మా, 50మెగావాట్ల క్లీన్ ఎనర్జి డేటా సెంట‌ర్ నిర్మించేందుకు అక్వెలోన్ నెక్సస్ , హైప‌ర్ స్కేల్ డేటా సెంట‌ర్ క్యాంప‌స్ ఏర్పాటుకు ఎజిపి గ్రూప్ ఒప్పందం కుదుర్చుకున్నాయి.

 

Also Read: ఇసిఐఎల్ లో ప్రాజెక్టు ఇంజినీర్ పోస్టులు

Leave A Reply

Your email address will not be published.