ఇసిఐఎల్ లో ప్రాజెక్టు ఇంజినీర్ పోస్టులు
ECIL: ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఇసిఎల్)లో ప్రాజెక్ట్ ఇంజినీర్ – 15, టెక్నికల్ ఆఫీసర్ -5, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్ -3 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన ఈ పోస్టులకు ఎంపిక జరుగుతుంది. విద్యార్హతలు, ఉద్యోగానుభవం, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
ప్రాజెక్టు ఇంజినీర్:
సిఎస్ ఇ / ఐటి/ ఇసిఇ/ ఇఇఇ/ ఇఐ/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌తో బిఇ/ బిటెక్ అర్హతలతో ప్రాజెక్టు ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మూడుళ్ల ఉద్యోగానుభవం అవసరం.
అభ్యర్థుల వయస్సు 33 సంవత్సరాలు
ఈ పోస్టుకు ఎంపికైన వారికి మొదటి ఏడాది నెలకు రూ. 40వేల జీతం అందుతుంది. తరువాత ఏడాది రూ. 45వేలు, మూడో ఏడాది రూ. 50వేలు ఉంటుంది.
టెక్నికల్ ఆఫీసర్
సిఎస్ ఇ / ఐటి/ ఇసిఇ/ ఇఐ/ ఇటిసి ఎలక్ట్రానికస్ బ్రాంచ్‌తో బిఇ/ బిటెక్ , ఏడాది అనుభవం అవసరం,
అభ్యర్థుల వయస్సు 30 సంవత్సరాలు
ఈ పోస్టుకు ఎంపికైన వారికి మొదటి ఏడాది నెలకు రూ. 25వేల జీతం అందుతుంది. తరువాత ఏడాది రూ. 28 వేలు, మూడో ఏడాది రూ. 31వేలు ఉంటుంది
అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్:
ఎలక్ట్రానికస్ / ఇసిఇ/ ఎలక్ట్రికల్/ ఇఇఇ ఇన్‌స్ట్రుమెంటేషన్/ ఇఅండ్ ఐ / మెకానికల్ బ్రాంచ్‌తో ఇంజినీరింగ్ డిప్లొమా 60% మార్కులు ఉండాలి. ఏడాది అనుభవం అవసరం.
అభ్యర్థుల వయస్సు 30 సంవత్సరాలు.
ఈ పోస్టుకు ఎంపికైన వారికి నెలకు జీతం రూ. 25,506.
సౌత్‌జోన్ వారికి ఇసిఐఎల్ జోనల్ ఆఫీస్, ఎకనామిస్ట్ హౌస్, పోస్ట్ బాక్స్ నెం.3148, ఎస్- 15, ఇండస్ట్రియల్ ఎస్టేట్ , చెన్నై – 600032లో వాక్ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ తేదీ డిసెంబర్ 16.
అభ్యర్థులు పూర్తి వివరాలకు www.ecil.co.in వెబ్‌సైట్ చూడగలరు.
Also Read: రాష్ట్రంలో పెట్టుబుడులు పెట్టేందుకు ముందుకొచ్చిన కంపెనీలు
[…] […]