మెగా కుటుంబంలో మొదలైన పెళ్లి సందడి..

మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల తనయ నిహారిక పెళ్లికి మరో నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే కుటుంబ సభ్యులు రాజస్థాన్‌లో పెళ్లి వేడుక జరిగే ఉదయపూర్ ప్యాలెస్‌కు చేరుకొని పెళ్లి పనులు మొదలుపెట్టారు. ఈ రోజు నిహారికను పెళ్లి కూతురిని చేసారు. గుంటూరు ఐజీ జె. ప్రభాకర్‌ రావు కుమారుడు చైతన్యను నిహారిక పెళ్లిచేసుకోబోతున్న విషయం తెలిసిందే. నిహారిక పెళ్లి రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్‌లోని కోటలో అంగరంగ వైభవంగా జరగనుంది. డిసెంబర్ 9న జరగబోయే ఈ వేడుక కోసం ఇప్పటికే మెగా కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కల్యాణ్‌, అల్లు అర్జున్ మినహాయిస్తే మిగిలిన కుటుంబ సభ్యులు అక్కడే ఉన్నారు. నిహారిక ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా అదిరిపోతున్నాయి. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Leave A Reply

Your email address will not be published.