యాదాద్రి ఆలయంలో భక్తుల రద్దీ

హైదరాబాద్: ఈ రోజు ఆదివారం సెల‌వు రోజు కావ‌డంతో యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి ఆలయానికి భక్తుల‌ రద్దీ పెరిగింది. భారీగా భక్తులు తరలిరావడంతో లక్ష్మీనృసింహస్వామి దర్శనానికి సుమారు రెండుగంటల సమయం పడుతోంది. ఆలయ అధికారులు భక్తులకు లఘు దర్శనం కల్పిస్తున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో అధికారులు ప్రభుత్వ ఆదేశాల మేరకు లోబడి.. థర్మల్‌ స్క్రీనింగ్‌, శానిటైజేషన్‌ తర్వాతే ఆలయంలోకి భక్తులను అనుమతి ఇస్తున్నారు. యాదాద్రి అభివృద్ధి పనుల దృష్ట్యా కొండపైకి వాహనాలకు అనుమతి ఇవ్వడం లేదు.

భక్తి భావం విరాజిల్లేలా త‌యార‌వుతున్న యాద‌గిరి గుట్ట శ్రీ ల‌క్ష్మి న‌ర‌సింహ‌స్వామి దేవాల‌యం (ఫొటోలు)
Leave A Reply

Your email address will not be published.