Jubilee Hills by-election: నామినేషన్ వేసిన విష్ణువర్ధన్‌రెడ్డి
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అన్ని రాజకీయ పార్టీలు సీరియస్‌గా తీసుకున్నాయి. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేశాయి. బలాబలాలు బేరీజు వేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి తప్పులు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా ఇప్పటికే సునీత 3 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేసింది. ఒక వేళ ఏదైనా కారణాలతో నామినేషన్ తిరస్కరణకు గురైతే తీసుకునే జాగ్రత్త చర్యల్లో భాగంగా బిఆర్ ఎస్ నేతలు విష్ణువర్ధన్ రెడ్డితో నామినేషన్ వేయించారు.
ఇప్పటికే పార్టీలు ప్రచార ప్రణాలికలు రూపొందిస్తున్నాయి. దానిలో భాగంగా తాజాగా అధికార కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసేందుకు 40 మంది సభ్యులతో స్టార్ క్యాంపైనర్లతో లిస్టును విడుదల చేసింది.
Also Read: కుమురం భీం జిల్లాలో నిండు గర్భిణీ హత్య!
[…] […]