ఎన్నికల విధులకు గైర్హాజర్.. 30 మందికి నోటీసులు

- కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్

కామారెడ్డి (CLiC2NEWS): కామారెడ్డి జిల్లాలో బుధవారం నుంచి గ్రామపంచాయతీ మూడో విడత ఎన్నికలు నిర్వహిస్తుండగా ఈ ఎన్నికలకు గైర్హాజరైన 39 మంది అధికారులకు, పోలీస్ సిబ్బందికి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి, ట్రైనింగ్ మేనేజ్మెంట్ నోడల్ అధికారి రాజు నోటీసులు జారీ చేశారు. బుధవారం జరుగుతున్న ఎన్నికల సందర్భంగా మంగళవారం రిపోర్టు చేయాల్సిన 39 మంది పోలింగ్ సిబ్బంది అధికారులకు రిపోర్ట్ చేయలేదని, దీంతో విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లగా ఆయన వెంటనే వారికి నోటీసులు జారీ చేయాల్సిందిగా ఆదేశించారు. ఈ సందర్భంగా ఎన్నికల విధుల్లో సిబ్బంది నిర్లక్ష్యాన్ని సహించేది లేదన్నారు.

Also Read: ప‌వ‌న్‌హాన్స్ లిమిటెడ్‌లో మేనేజ‌ర్ పోస్టులు

1 Comment
  1. […] ఎన్నికల విధులకు గైర్హాజర్.. 30 మందికి న… […]

Leave A Reply

Your email address will not be published.