హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
హైదరాబాద్ (CLiC2NEWS): శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నగరానికి చేరుకున్నారు. ప్రతి ఏడాది శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి హైదరాబాద్ వస్తుండటం తెలిసిన విషయమే. తాజాగా నగరానికి చేరుకొన్న రాష్ట్రపతికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క స్వాగతం పలికారు. వీరితో పాటు మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క కూడా ఉన్నారు.
నగరంలో రాష్ట్రపతి 22వ తేదీ వరకు ఉండనున్నారు. రేపు నిలయంలో విశ్రాంతి తీసుకునొ.. 19వ తేదీన ఫిల్మ్‌సిటిలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమానికి హాజరవుతారు. 20వ తేదీన గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో పాల్గొంటారు. 21న నిలయంలో నిర్వహించే పౌరుల భేట, ఎట్ హోమ్‌లో రాష్ట్రపతి పాల్గొంటారు. 22వ తేదీ సాయంత్రం ఢిల్లీకి బయలుదేరతారు.
Election News: ఎన్నికల విధులకు గైర్హాజర్.. 30 మందికి నోటీసులు
[…] […]