Adilabad: బొలెరో బోల్తా ప‌డి ఇద్దరు మృతి..

ఆదిలాబాద్‌ (CLiC2NEWS): జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న ఘ‌ట‌న‌లో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా మరో 14 మందికి గాయాలయ్యాయి. ఈ ప్ర‌మాదం ఇచ్చోడ మండలం ఇస్లాంనగర్‌ శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. నాగ్‌పూర్‌ నుంచి వాహనం హైదరాబాద్‌కు వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. గాయ‌ప‌డిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్న‌ట్లు తెలిసింది. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.