Amit Sha: వారు ప‌హ‌ల్గాం ఉగ్ర‌మూక‌లే: అమిత్‌షా

న్యూఢిల్లీ (CLiC2NEWS): జ‌మ్మూకాశ్మీర్‌లో సోమ‌వారం జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్ మ‌ర‌ణించిన ముగ్గురు ఉగ్ర‌వాదులు ప‌హ‌ల్గాం ఘ‌ట‌న‌కు సంబంధించిన వారేన‌ని కేంద్ర హోమంత్రి అమిత్‌షా ప్ర‌క‌టించారు. మంగ‌ళ‌వారం లోక్‌స‌భ‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ మాట్లాడుతూ ఈ ప్ర‌క‌ట‌న చేశారు. రెండో రోజు `ఆప‌రేష‌న్ సిందూర్‌`పై చ‌ర్చ‌లో భాగంగా కేంద్ర హోంమంత్రి స‌భ‌లో ఉగ్ర‌మూక‌ల ఎన్‌కౌంట‌ర్‌పై మాట్లాడారు.

ఈ ఎన్‌కౌంట‌ర్‌లో కీల‌క నిందితుడు సులేమాన్ ను మ‌న భ‌ద్ర‌తా ద‌ళాలు హ‌త‌మార్చాయ‌ని హోంమ‌త్రి స‌భ‌కు వెల్ల‌డించారు.

ఈ ఎన్‌కౌంట‌ర్ మ‌ర‌ణించి ముగ్గురు ఉగ్ర‌వాదులు పాకిస్థాన్ నుంచి వ‌చ్చార‌ని.. దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు త‌మ వ‌ద్ద ఉన్నాయ‌ని అమిత్ షా స‌భ‌కు వెల్ల‌డించారు.

ఈ సంద‌ర్భంగా ఆప‌రేష‌న్ మ‌హ‌దేవ్ ద్వారా ఉగ్ర‌మూక‌ల‌ను మ‌ట్టుబెట్టిన భ‌ద‌తా ళాల‌కు, జ‌మ్మూ కాశ్మీర్ పోలీసులు హోంమంత్రి అభినంద‌న‌లు తెలిపారు.

స‌భ‌లో హోంమంత్రి అమిత్‌షా మాట్లాడుతూ…. “జ‌మ్మూలోని ప‌హల్గాంలో ఉగ్ర‌మూక‌ల దాడిలో.. బాధితుల‌ను మ‌తం పేరు అడిగి మ‌రీ చంపారు. ఈ ఘ‌ట‌న అనంత‌రం నేను ఆ ప్రాంతానికి వెంట‌నే వెళ్లాను. ఆ స‌మ‌యంలో బాధితుల‌తో మాట్లాడాను.. వారి బాధులు తెలుసుకున్నా.. ఆప‌రేష‌న్ మ‌హ‌దేవ్ లో భాగంగా సోమ‌వారం ముగ్గురు ఉగ్ర‌వాదుల‌ను మ‌న సైనికులు హ‌త‌మార్చారు. మ‌ర‌ణించిన ముగ్గురిలో ప‌హ‌ల్గాం కీల‌క నిందితుడు సులేమాన్ హ‌త‌మ‌య్యాడు. ఉగ్ర‌వాదుల‌కు ఆశ్ర‌యం ఇచ్చిన వారిని ఎన్ ఐ ఎ అదుపులోకి తీసుకుంది. దాడిలో దొరికిన మ‌ర‌ణాయుధాల‌ను ఎఫ్‌. ఎస్‌.ఎల్‌.కు పంపాం. అని స‌భ‌లో అమిత్ షా వెల్ల‌డించారు.

 

ఇవి కూడా చ‌ద‌వండి: Tirumala: తిరుమ‌ల శ్రీ‌వారికి రూ. 2.4 కోట్ల భారీ కానుక‌

Leave A Reply

Your email address will not be published.