Eluru: ఉంగుటూరు సమీపంలో బైక్ను ఢీకొట్టిన అంబులెన్స్..
ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు
ఏలూరు (CLiC2NEWS): ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరం వద్ద అంబులెన్స్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కైకరానికి చెదిన గున్ను శ్రీరామ మూర్తి, పెండ్ర చిరంజీవి పొలానికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుండి తణుకు వెళుతున్న ప్రైవేటు అంబులెన్స్ వీరు ప్రయాణిస్తున్న బైక్ను బలంగా ఢీకొట్టడంతో ఇద్దరూ మృతి చెందారు.