ఉత్తరకాశీలో వరద బీభత్సం..
ఉత్తరకాశీ (CLiC2NEWS): ఉత్తరకాశీలో వరద బీభత్సం సృష్టించింది. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో కంభవృష్టి కారణంగా మెరుపు వరదలు సంభవించాయి. ధరాలి గ్రామంపై జలప్రవాహం విరుచుకుపడి గ్రామం లోని ఇళ్లు కొట్టుకుపోయాయి. వరద నీటి ఉద్ధృతికి నివాసాలు ,ప్రజలు కొట్టుకుపోయారు. వీటికి సంబంధించిన దృశ్యాల వీడియో సోషల్ మీడియాల్లో వైరలవుతోంది. ఈ ప్రమాదంలో దాదాపు 50 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు సమాచారం.
మెరుపు వరదలు గురించి సమాచారం తెలుసుకున్న ఎస్‌డిఆర్ ఎఫ్ రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఎన్‌డిఆర్ ఎప్, ఐటిబిపి బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభిచాయి.
ధరాలీలో కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా ఎగువ ప్రాంతమైన ఖీర్‌గఢ్ నుండి మెరుపు వరదలు సంభవించాయి. ఈ ఘటనపై రాష్ట్ర సిఎం ధామి దిగ్భాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. మరోవైపు కేంద్ర మంత్రి అమిత్‌షా ఘటనపై ఆరా తీశారు. కేంద్రం తరపునుండి అన్ని సహాయక సహకారాలు అందిస్తామని తెలిపినట్లు సమాచారం.

చార్‌ధామ్ యాత్రికులు ధరాలీ (Dharali) గ్రామానికి భారీ సంఖ్యలో వెళుతుంటారు. ఇది ఉత్తరాఖండ్‌లో మారుమూలున్న అత్యంత రమ్యమైన ప్రదేశాల్లో ఒకటి. దీని సమీపం నుండి భాగీరథి నది ప్రవహిస్తుంది. ఇక్కడి నుండి గంగోత్రి ధామ్ కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హర్సిలీ లోయ 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అకాల వర్షాలు, వరదలు కారణంగా ప్రస్తుతం ఈ గ్రామం రూపురేఖలు మారిపోయాయి.
[…] ఉత్తరకాశీలో వరద బీభత్సం.. […]
[…] ఉత్తరకాశీలో వరద బీభత్సం.. […]
[…] ఉత్తరకాశీలో వరద బీభత్సం.. […]