స‌త్య‌సాయి జిల్లాలో న‌వ వ‌ధువు ఆత్మ‌హ‌త్య‌

పెనుకొండ (CLiC2NEWS): స‌త్య‌సాయి జిల్లాలో పోళ్లింట విషాదం చోటు చేసుకుంది. సోమ‌వారం ఉద‌యం వివాహం జ‌రిగిన న‌వ వ‌ధువు.. రాత్రి ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. స‌త్య‌సాయి జిల్లా సోమందేప‌ల్లి మండ‌ల కేంద్రానికి చెందిన కృష్ణ‌మూర్తి, వ‌ర‌ల‌క్ష్మి దంప‌తుల ఏకైక కుమార్తెకు సోమ‌వారం ఉద‌యం ఘ‌నంగా వివాహం చేశారు. ఏమైందో తెలియ‌దు కాని అదే రోజు రాత్రి న‌వ వ‌ధువు బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. త‌న గ‌దిలో ఉరేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. కుంటుంబ స‌భ్య‌లు, బంధువులు గ‌ది త‌లుపులు ప‌గ‌లగొట్టి హుటాహుటిన ఆమెను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కానీ ఫ‌లితం లేక‌పోయింది. ఆస్ప‌త్రికి చేరేలోపే ఆమె మృతి చెందింది. ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాలు తెలియ‌రాలేదు.

 

నా లాగా అర్ధం కాని చ‌దువు వ‌ద్దు.. ఇంట‌ర్ విద్యార్ధిని ఆత్మ‌హ‌త్య‌

Leave A Reply

Your email address will not be published.