AP: లారీని ఢీ కొన్న కారు. నలుగురు మృతి
పెద్దాపురం (CLiC2NEWS): తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని పెద్దాపురంలో ఈ ప్రమాదంలె నలుగురు ప్రాణాలు కోల్పోయారు. గృహ ప్రవేశ వేడుకలో పాల్గొనేందుకు తాళ్లరేవు మండలం పెద్దవలస నుంచి రాజమహేంద్రవరానికి 9 మంది కుటుంబ సభ్యులు ఒక కారులో బయల్దేరారు. పెద్దాపురంలోని ఎడిబి రోడ్డుపై డ్రైవర్ నిద్రమత్తులో ఎదురుగా వస్తున్న లారీని, కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. మృతి చెందిన వారిలో 5 నెలల చిన్నారి ఉంది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
