‘బాహుబలి’కి పదేళ్లు..
BAHUBALI: ‘వై కట్టప్ప కిల్ల్డ్ బాహుబలి’.. ఒక సెన్సేషన్.. రాజమౌళి దర్వకత్వంలో ప్రభాస్ హీరోగా తెలుగు చలన చిత్ర రంగం ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన సినమా ‘బాహుబలి’. ఈ చిత్రం విడుదలై నేటికి పదేళ్లు. ఈ సినిమా విడుదలయ్యాక చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరిని వెంటాడిన ప్రశ్న ‘వై కట్టప్ప కిల్ల్డ్ బాహుబలి’. ఈ చిత్రంలో ప్రభాస్ , రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ , నాజర్ తదితరులు నటించారు. అయితే సత్యరాజ్ (కట్టప్ప) పాత్రకు సంజయ్‌దత్.. రమ్యకృష్ణ (శివగామి) పాత్రకు మొదట శ్రీదేవిని అనుకున్నారట. ఇక ప్రతినాయకుడు పాత్రలో అలరించిన రానా.. అతని పాత్రకు ముందగా హాలీవుడ్ నటుడు జేసన్ మమోవా ను సంప్రదించారట. ఈ సినిమాలో స్త్ర్రీ , పురుషులు ఇద్దరికీ ఒకే విధమైన ప్రాధాన్యం ఉండే విధంగా యాక్షన్ డ్రామా కావాలని రాజమౌళి , విజయేంద్ర ప్రసాద్‌ను కోరారట. 2015 జులై 10వ తేదీన విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టింది. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసింది.
