త‌ల న‌రికి.. వేళ్లు క‌త్తిరించి.. మ‌హిళ దారుణ హ‌త్య‌!

నిజామాబాద్ (CLiC2NEWS): నిజామాబాద్ జిల్లా న‌వీపేట మండ‌లం మిట్టాపూర్‌లో దారుణ‌మైన హ‌త్య జ‌రిగింది. ఓ మ‌హిళ మృత‌దేహాన్ని స్థానికులు, అటుగా వెళ్తున్న‌వారు బాస‌ర మెయిన్ రోడ్డు ప‌క్క‌న గుర్తించారు. ఈ మేర‌కు వారు పోలీసులకు స‌మాచారం అందించారు.

స‌మాచార‌మందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని ద‌ర్యాప్తు ప్రారంభించారు. మ‌హిళ వ‌య‌స్సు 30నుంచి 40 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉంటుంద‌ని తెలిపారు. ఘ‌ట‌నాస్థ‌లంలో మృత‌దేహం వివ‌స్త్ర‌గా ఉండ‌టంతో అత్యాచారం జ‌రిగిన‌ట్లు పోలీసులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రో చోట చంపి బాస‌ర మెయిన్ రోడ్డు ప‌క్క‌న ప‌డేసిన‌ట్లుగా కూడా పోలీసులు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు.

ఘ‌ట‌నాస్థ‌లాన్ని పోలీసు క‌మిష‌న‌ర్ సాయి చైత‌న్య ప‌రిశీలించారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Also Read: Hyderabad: మియాపూర్‌లో ఐదంత‌స్తుల భ‌వ‌నాన్ని కూల్చివేసిన హైడ్రా!

Leave A Reply

Your email address will not be published.