Hyderabad: మియాపూర్‌లో ఐదంత‌స్తుల భ‌వ‌నాన్ని కూల్చివేసిన హైడ్రా!

హైద‌రాబాద్ (CLiC2NEWS): అక్ర‌మ నిర్మాణాల‌పై హైడ్రా మ‌రోసారి పంజా విసిరింది. మియాపూర్‌లోని స‌ర్వే నంబ‌ర్ 100లో అక్ర‌మంగా నిర్మించిన భ‌వ‌నాన్ని శ‌నివారం ఉద‌యం హైడ్రా కూల్చివేత చ‌ర్య‌లు చేపట్టింది. ఇక్క‌డి భారీ అక్ర‌మ నిర్మాణం నిర్మించిన‌ట్లు స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. హెచ్ ఎం డి ఎ ఫెన్సింగ్ తొల‌గించి మ‌రీ భ‌వ‌నాన్ని అక్ర‌మంగా నిర్మించార‌ని ఫిర్యాదు చేశారు.

ఈ మేర‌కు హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. అక్ర‌మంగా నిర్మించిన భారీ భ‌వ‌నాన్ని తొల‌గించేందుకు హెచ్ ఎం డి ఎ, హైడ్రా అధికారులు ఇవాళ ఉద‌యం చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఈ మేర‌కు అధికారులు భారీగా పోలీసుల‌ను మోహ‌రించారు.

Also Read: కాశీబుగ్గ ఆల‌యంలో తొక్కిస‌లాట‌: 9 మంది మృతి!

1 Comment
  1. […] Also Read: Hyderabad: మియాపూర్‌లో ఐదంత‌స్తుల భ‌వ‌నాన్… […]

Leave A Reply

Your email address will not be published.