రూ.100 లోపు ఉన్న సినిమా టికెట్ల‌పై జెఎస్‌టి త‌గ్గింపు

సింగిల్ స్క్రీన్ థియేట‌ర్ల‌కు నేరుగా ప్ర‌యోజ‌నం

ఢిల్లీ (CLiC2NEWS): సింగిల్ స్క్రీన్ థియేట‌ర్ల‌కు ప్ర‌యోజ‌నం క‌లిగించే విధంగా  కేంద్రం జిఎస్‌టిని త‌గ్గించింది. రూ.100లోపు ఉన్న టికెట్ల‌పై ఉన్న 12% జిఎస్‌టిని .. 5%కి త‌గ్గించింది. రూ.100 కంటే ఎక్కువ ఉన్న టికెట్ల‌పై ఉన్న 18% జిఎస్‌టి కొన‌సాగుతుంది.  మ‌ల్టీప్లెక్స్ లు రావ‌డంతో సింగిల్ స్క్రీన్ థియేట‌ర్ల‌కు ఆద‌ర‌ణ క‌ర‌వైంది. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణ‌యంతో చిన్న ప‌ట్టణాల్లోని థియేట‌ర్ల‌కు, సింగిల్ స్క్రీన్ థియేట‌ర్ల‌కు ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది. అయితే, మ‌ల్టీప్లెక్స్‌ల‌కు, ప్రీమియం థియేటర్ల‌కు తాజా జిఎస్‌టి స‌వ‌రింపుతో ఎటువంటి ప్ర‌యోజ‌నం ఉండ‌దు.

మ‌రోవైపు పాప్‌కార్న్‌పై జిఎస్‌టి స‌వ‌రింపు జ‌రిగింది. గ‌తంలో ఒకే పాప్‌కార్న్‌పై ప్యాకేజింగ్‌ను బ‌ట్టి వేర్వేరుగా ప‌న్ను విధించే వారు. అది నాలుగు శ్లాబులుగా ఉండేది. తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం దీనిలో స‌వ‌రింపు చేసింది. నాలుగు శ్లాబుల‌ను రెండుకు త‌గ్గించింది. నూత‌న జిఎస్‌టి విధానంలో సాల్ట్ పాప్‌కార్న్ 5% ప‌న్ను ప‌రిధిలోకి రాగా.. క్యార‌మిల్ పాప్‌కార్న్ 18%లో ఉంది. ఇపుడు పాప్‌కార్న్ ప్యాక్‌చేసి విక్రయించినా.. విడిగా విక్ర‌యించినా ఒకే రకంగా ఉంటుంది. ఏ విధంగా విక్ర‌యించినా సాల్టెడ్ పాప్‌కార్న్ 5% శ్లాబ్ లోకి వ‌స్తుంది. చ‌క్కెర క‌లిపిన క్యార‌మిల్ పాప్‌కార్న్ 18% ప‌న్ను ప‌రిధిలోకి వ‌స్తుంది.

 

Also Read: శీర్షిక: ఉపాధ్యాయ దినోత్సవం

Leave A Reply

Your email address will not be published.