భారత్ ఎర్త్ మూవర్స్ లో 100 పోస్టులు
రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన మల్టీ టెక్నాలజి కంపెనీ అయిన భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(BRML)లో 100 మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టులు కలవు. మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
మెకానికల్ -90, ఎలక్ట్రికల్ -10 పోస్టులు కలవు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అనంతరం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు.
పరీక్షలో ఎంపికైన వారికి ఏడాది పాటు శిక్షణ ఉంటుంది. శిక్షణాంతరం ఆఫీసర్ (గ్రేడ్-2)గా నియమిస్తారు. ఏడాది పాటు ప్రొబేషన్ పిరియడ్ ఉంటుంది.
ఎంపికైనవారు నాలుగేళ్ల కాలానికి సర్వీస్ బాండ్ రాయాల్సి ఉంటుంది.
ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు వేతనం రూ. 40 వేల నుండి రూ.1,40,000 వరకు ఉంటుంది. మూల వేతనానికి అదనంగా డిఎ, హెచ్ ఆర్ఎ, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే, పిఎఫ్, గ్రాట్యుటి, ఇతర అలవెన్సులు ఉంటాయి.
29 ఏళ్ల లోపు వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. దరఖాస్తులను ఈ నెల 12వ తేదీ లోపు పంపించాల్సి ఉంది. దరఖాస్తు ఫీజు రూ. 500గా నిర్ణయించారు. ఎస్‌సి/ ఎస్‌టి/ దివ్యాంగులకు ఫీజు లేదు.
పరీక్ష, ఇంటర్వ్యూల తేదీలు, పరీక్ష కేంద్రాలు, పరీక్షకు సంబంధించిన సిలబస్ తదితర పూర్తి వివరాలకు అభ్యర్థులు వెబ్‌సైట్ https://www.bemlindia.in చూడగలరు.
Job News: ఇంటిలిజెన్స్ బ్యూరోలో 394 పోస్టులు