AP: మూడంతస్థుల భవనం కూలి మగ్గురు మృతి
కదిరి(CLiC2NEWS): అనంతపురంజిల్లా కదిరిలోని పాతఛైర్మన్ వీధిలో నిర్మాణంలో ఉన్న మూడంతస్థుల భవనం కూలి పక్కనే ఉన్న మరో భవనం మీద పడింది. ఈ ఘటనలో మగ్గురు చెందారు. మృతి చెందిన వారిలో ఒక మహిళ, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఈ ఘటనలో మొత్తం 15 మంది శిధిలాల కింద చిక్కుకున్నారు. 10 మంది క్షేమంగా బయట పడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టారు. భవనం కూలే సమయంలో గ్యాస్ సిలెండర్ పేలిందని బాధితులు తెలిపారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భవనం దెబ్బతిని ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు భావిస్తున్నారు.