యాదాద్రి శ్రీ‌ల‌క్ష్మీన‌ర‌సింహ్మ‌స్వామిని ద‌ర్శించుకున్న సిఎం కెసిఆర్‌

యాదాద్రి (CLiC2NEWS): యాదాద్రిలోని బాలాల‌యంలో శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ్మ‌స్వామిని ముఖ్య‌మంత్రి కెసిఆర్ సోమ‌వారం ద‌ర్శించుకున్నారు. ఆల‌యం ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించిన అనంత‌రం వేద పండితులు ముఖ్య‌మంత్రికి ఆశీర్వ‌చ‌నం అందిచారు.
ముందుగా బాలాల‌యానికి చేరుకున్న ముఖ్య‌మంత్రికి అర్చ‌కులు పూర్ణ‌కుంభంతో స్వాగ‌తం ప‌లికారు.

ఈ సంద‌ర్భంగా సిఎం ఆల‌య అభివృద్ధి ప‌నుల‌ను ప‌రిశీలించారు. కాలిన‌డ‌క‌న ఆల‌యం చుట్టూ తిరిగి ప‌లు సూచ‌న‌లు చేశారు.
మార్చి 28వ తేదీన మ‌హాకుంభ సంప్రోక్ష‌ణ కార్య‌క్ర‌మం నిర్వహించాల‌ని ఇప్ప‌టికే ముహూర్తం నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే.
ఈ ప‌ర్య‌ట‌ల‌న‌లో సిఎం వెంట మంత్రులు జ‌గ‌దీశ్‌రెడ్డి, ప్ర‌శాంత్‌రెడ్డి, నాయ‌కులు మోత్కుప‌ల్లి ప‌లురు ఉన్నారు. ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో పోలీసులు ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.

Leave A Reply

Your email address will not be published.