ల‌తా మంగేష్క‌ర్‌కు రాజ్య‌స‌భ ఘ‌న నివాళి

న్యూఢిల్లీ (CLiC2NEWS): `భార‌త గాన కోకిల‌` ల‌తా మంగేష్క‌ర్ మృతి ప‌ట్ల రాజ్య‌స‌భ ఇవాళ (సోమ‌వారం) ఘ‌న నివాళి అర్పించింది. ఇవాళ క్వ‌శ్చ‌న్ అవ‌ర్‌ను స‌భ‌లో ర‌ద్దు చేశారు. అలాగే స‌భ‌ను గంట సేపు వాయిదా వేస్తున్న‌ట్లు రాజ్య‌స‌భ చైర్మ‌న్ వెంక‌య్య నాయుడు ప్ర‌క‌టించారు.

ల‌తా మంగేష్క‌ర్ మృతి ప‌ట్ల వెంక‌య్య నాయుడు తీవ్ర సంతాపాన్ని వ్య‌క్తం చేశారు. దేశంలో ఏడు ద‌శాబ్దాల పాటు ప్ర‌తి ఒక్క‌రి భావోద్వేగాన్ని ఆమె త‌న గ‌ళంలో వినిపించిన‌ట్లు ఉప‌రాష్ట్రప‌తి పేర్కొన్నారు.

1999 నుంచి 2005 మధ్య కాలంలో ల‌తాజి రాజ్య‌స‌భ‌లో స‌భ్యురాలిగా ఉన్న‌ట్లు తెలిపారు. భార‌తీయ సంగీతంలో ఆమెకు ప్ర‌త్యేక స్థానం ఉంద‌ని అన్నారు. ఆమె మ‌ర‌ణంతో ఒక శ‌కం ముగిసిన‌ట్లు ఆయ‌న చెప్పారు. ల‌తాజీ మృతికి నివాళిగా స‌భ్యులు నిమిషం పాటు మౌనం పాటించారు.

slot resmi

Leave A Reply

Your email address will not be published.