కంచ గ‌చ్చిబౌలిని అభివృద్ధి చేస్తాం.. సిఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ (CLiC2NEWS): ఎన్ని ఆటంకాలు ఎదురైనా కంచ గ‌చ్చిబౌలిని అభివృద్ధి చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పిజెఆర్ ఫ్లై ఓవ‌ర్‌ను సిఎం శ‌నివారం ప్రారంభించారు. అనంత‌రం ఆయ‌న న‌గ‌రానికి పిజెఆర్ చేసిన అభివృద్ధి గురించి మాట్లాడారు. హైద‌రాబాద్ న‌గ‌ర ప్ర‌జ‌ల దాహ‌ర్తిని తీర్చేందుకు పిజ జ‌నార్థ‌న‌రెడ్డి (పిజెఆర్‌) కృషి మ‌రువ‌లేనిద‌న్నారు. ఆయ‌న పోరాటాల వ‌ల్లే హైద‌రాబాద్‌కు కృష్ణా , గోదావ‌రి జ‌లాలు వ‌చ్చాయ‌న్నారు. ఎప్పుడు పిలిచినా ప‌లికే పేద‌ల నాయ‌కుడిగా ఎంతో గొప్ప పేరు సంపాదించార‌ని.. హైద‌రాబాద్ దోమ‌ల‌గూడ‌లోని పిజెఆర్ ఇల్లు ఒక జ‌న‌తా గ్యారేజిగా క‌నిపించేద‌ని అన్నారు.

పిజెఆర్ కృషితోనే గ‌చ్చిబౌలికి హైటెక్ సిటి మంజూరయిన‌ద‌ని.. దానికి నేదురుమ‌ల్లి జ‌నార్ధ‌న్ రెడ్డి శంకుస్థాప‌న చేశార‌ని తెలిపారు. అనంత‌రం చంద్ర‌బాబు దాన్ని మ‌రో స్థాయికి తీసుకెళ్లార‌ని గుర్తు చేశారు. కంచ గ‌చ్చిబౌలిలో కొత్త కంపెనీల ఏర్పాటుతో 5 ల‌క్ష‌ల ఉద్యోగాలు వ‌స్తాయ‌న్నారు. అక్క‌డి భూముల్లో ఆటంకాలు తాత్కాలిక‌మేనన్నారు. ఎంత‌మంది అడ్డుప‌డినా మా య‌జ్ఞం ఆగ‌ద‌ని.. రైజింగ్ తెలంగాణ -2047 ల‌క్ష్యంతో మాతో అంద‌రూ క‌లిసి వ‌స్తున్నార‌ని సిఎం తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.