స్త్రీ కి బాధ్యతలు ఎక్కువ..

 హైద‌రాబాద్‌ (CLiC2NEWS): మారుతున్న శకంతో పాటు మహిళ నిర్వర్తించాల్సిన బాధ్యతలు పెరుగుతున్నాయని ముఖ్య అతిథి బాల సాయి సేవాసమితి కన్వీనర్ అనుపమ అన్నారు. ఇందిరా పార్క్ లో అత్యంత వైభవంగా మహిళా శక్తి దినోత్సవాన్ని నిర్వహించారు. ఇందిరా పార్క్ యోగా సెంటర్ ఇన్ ఛార్జ్ గురువు బి. సరోజినీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ నేటి ఆధునిక సమాజంలో స్త్రీ ఎదుటనున్న సమస్యలు తనకు తాను తెలుసు కోవాలన్నారు.
డా.హిప్నో పద్మా కమలాకర్ మాట్లాడుతూ మహిళలు చాలా తెలివైనవారు, ఎందుకంటే వారికి తక్కువ తెలిసినా ఎక్కువగా అర్థం చేసుకుంటారన్నారు. మహిళలు సామాజిక, విద్యా, ఆర్థిక, రాజకీయ మరియు మానసికంగా దృఢంగా ఉండాలన్నారు. సావిత్రి రీల్ లైఫ్ లో మహానటి అయితే సరోజినీ మేడం రియల్ లైఫ్ లో మహానటి అని తెలిపారు. ఈరోజు ఇంత మంది మహిళలు ఇక్కడకు రావడం సరోజినీ గారి ప్రోత్సాహమేనన్నారు. ఆమె ప్రతి మహిళలో వున్న అద్భుతమైన వనరులను గుర్తించి వెలికి తీస్తారన్నారు. సరోజనీ గారికి దేనినైనా ప్రేమతో మార్చగల శక్తి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ యోగ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నరేంద్ర సింగ్ వాలియా, యోగా శిక్షకులు యశోద, శ్రీ లత, పూర్ణ కుమారి, ఝాన్సీ, లత, బి.రామారావు, సౌమ్య, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.