పెళ్ల‌యిన నెల‌లోపే భార్య‌భ‌ర్త‌ల బ‌ల‌వ‌న్మ‌ర‌ణం!

ద‌స‌రా రోజున భార్య.. దీపావ‌ళి నాడు భ‌ర్త‌!.. జ‌గిత్యాల జిల్లాలో ఘ‌ట‌న‌...

జ‌గిత్యాల (CLiC2NEWS): ఎంతో అన్యోన్యంగా ప్రేమించుకొని.. పెద్ద‌ల‌ను కూడా ఒప్పించి పెళ్లిచేసుకున్న ఓ యువ జంట పెళ్ల‌యిన నెల‌లోపే బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డారు.

అదీ భార్య ద‌సరా రోజు.. భార్త దీపావ‌ళి నాడు ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఈ విషాధ ఘ‌ట‌న జిగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.

గ్రామ‌స్థుల క‌థ‌నం మేర‌కు…

జ‌గిత్యాల జిల్లా ఇబ్ర‌హీంప‌ట్నం మండ‌లంలోని ఎర్దండి గ్రామానికి చెందిన అల్లెపు సంతోష్‌, అదే గ్రామానికి చెదిన గంగోత్రి ఈ యేడాది సెప్టెంబ‌రు 26న పెద్ద‌ల స‌మ‌క్షంలో పెళ్లి చేసుకొన్నారు. వారిరువురు ఎంతో అన్యోన్యంగా నాలుగేళ్లు ప్రేమించుకొని.. ఇరువైపుల కుటుంబ‌స‌భ్యుల‌ను ఒప్పించి మ‌రీ పెళ్లి చేసుకొన్నారు.

వీరి ఇద్ద‌రి ఇళ్ల‌కు మ‌ధ్య కేవ‌లం నాలుగు ఇళ్ల దూరం మాత్ర‌మే.. అయితే అక్టోబ‌రు 2వ తేదీ విజ‌య ద‌శ‌మినాడు అత్తారింటికి వెళ్లాడు.కొత్త అల్లు డు సంతోష్‌. అయితే ద‌స‌రా నాడు వండిన వంట‌ల్లో కొద్దిగా కారం ఎక్కువైంద‌ని భార్య గంగోత్రిని మంద‌లించాడు. దానికి తీవ్ర మ‌న‌స్థాపానికి గురైన గంగోత్రి అదే రోజు రాత్రి అత్తింట్లో ఉరివేసుకుని బల‌వన్మ‌ర‌ణం చెందింది.

అల్లెపు సంతోష్ (ఫైల్‌)

ఆ రోజు నుంచి ఎంతో వేద‌న‌తో ఉన్న సంతోష్ దీపావ‌ళి సంద‌ర్భంగా ఆదిలాబాద్ లో ఉంటున్న త‌న అక్క వ‌ద్ద‌కు వెళ్లాడు. దీపావ‌ళి రోజున ఎవ‌రులేని స‌మ‌యంలో ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు.

దీంతో ఒక్క‌సారిగా ఎర్దండి గ్రామంలో విషాద చాయ‌లు అలుముకున్నాయి. పెళ్ల‌యిన నెల‌లోపే న‌వ దంప‌తులు ఆత్మ‌హత్య చేసుకోవ‌డం.. అదీ ద‌స‌రాకు ఒక‌రు.. దీపావ‌ళికి ఒక‌రు బ‌ల‌వ‌న్మ‌ర‌ణం చెంద‌డంతో ఆగ్రామంలో విషాదం అలముకుంది.

Also Read: ఆంధ్ర‌లో 6 జిల్లాల‌కు రెడ్ అల‌ర్ట్‌

 

1 Comment
  1. […] పెళ్ల‌యిన నెల‌లోపే భార్య‌భ‌ర్త‌ల బ‌… […]

Leave A Reply

Your email address will not be published.