ఖమ్మంలో ఘోరం.. రౌడీ షీటర్ వేధింపులతో వివాహిత ఆత్మహత్య!
ఖమ్మం (CLiC2NEWS): అల్లరిమూకల వేధింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ రౌడీ షీటర్ వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసకుంది.
ఎన్స్పెక్టర్ ఉస్మాన్ షరీఫ్ కథనం మేరకు…
ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెం పంచాయతీ జగ్యాతండాకు చెందిన బోడ సుశీల (28) సోమవారం చేలో పత్తి తీసేందుకు కూలికి వెళ్లింది. పొలంలో పనిచేస్తున్న సుశీల ను ఆమెఇంటి ఎదురుగా ఉన్న రౌడీ షీటర్ ధరావత్ వినయ్ వేధింపులకు గురిచేశాడు. పొలం పనిచేస్తున్న సుశీలను తన కోరిక తీర్చాలని వేధించాడు. దాంతో అతన్ని తీవ్రంగా ప్రతిఘటించింది సుశీల.
ఈ ఘటనతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె ఇంటికి వచ్చి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సుశీలకు భర్త, ఒక కుమారుడు ఉన్నారు. భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు రౌడీషీటర్ ధరావత్ నినయ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.
గత నెలలోనే వినయ్పై రౌడీషీట్ తెరిచినట్లు పోలీసులు తెలిపారు. కాగా సుశీల మృతిపై బందువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సుశీల ఒంటిపై గాయాలున్నాయని, పోస్టుమార్టం పరీక్షలో ఆ గాయాలను పరిగణనలోకి తీసుకోలేదని వారు రహదారపై ఆందోళనకు దిగారు. దీంతో బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
[…] ఖమ్మంలో ఘోరం.. రౌడీ షీటర్ వేధింపులత… […]