ఢిల్లీ-వాషింగ్టన్: ఎయిరిండియా సర్వీసులు రద్దు..
ఢిల్లీ (CLiC2NEWS): ఢిల్లీ -వాషింగ్టన్ డిసి మధ్య నాన్ స్టాప్ విమాన సర్వీసులను నిలిపివేయనున్నట్లు ఎయిరిండియా (Air India) విమానయాన సంస్థ పేర్కొంది. ఈ నిర్ణయం సెప్టెంబర్ 1 నుండి అములులోకి రానున్నట్లు వెల్లడించింది. పాకిస్థాన్ గగనతలం మూసివేత ఇంకా కొనసాగతుండటం ఒక కారణం కాగా.. విమానాల కొరత కూడా కారణమని తెలుస్తోంది. 26 బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానాలకు రెట్రోఫిట్ చేపడుతున్నందున విమానాల కొరత ఏర్పడుతుంది. గత నెలలోనే రిట్రోఫిట్ చేయడం ప్రారంభించినట్లు సమాచారం.
ఎయిరిండియా తీసుకున్న ఈ నిర్ణయంతో సెప్టెంబర్ 1 నుండి తర్వాత టికెట్లు బుక్ చేసుకున్న వారకి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తున్నారు. ప్రయాణికులను వ్యక్తిగత ప్రాధాన్యత ప్రకారం వారిని ఇతర విమానాల్లో రీబుకింగ్ లేదా పూర్తి రిఫండ్ వంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయనున్నారు.
[…] […]