ఛత్తీస్‌గ‌ఢ్‌లో ఎన్‌కౌంట‌ర్‌-12 మంది మావోయిస్టులు మృతి

సుక్మా (CLiC2NEWS): ఛత్తీస్ గ‌ఢ్ (Chhattisgarh) రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో భారీ ఎన్ కౌంట‌ర్ (Encounter) జ‌రిగింది. భ‌ద్ర‌తా ద‌ళాల‌కు, మావోయిస్టుల‌కు మ‌ధ్య‌న శ‌నివారం ఎదురు కాల్ప‌లు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంట‌ర్‌లో దాదాపు 12 మంది మావోయిస్టులు మ‌ర‌ణించిన‌ట్లు ఛ‌త్తీసగ‌ఢ్ పోలీసులు తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో కొంటా ఏరియా క‌మిటీ కార్య‌ద‌ర్శి మంగ‌డు ఉన్న‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. ఎన్‌కౌంట‌ర్ జ‌రిగిన ప్రాంతం నుంచి ఇన్సాస్ రైఫిల్స్‌, ఎకె -47 (AK-47)తో స‌హా ప‌లు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ ఘ‌ట‌న‌పై మ‌రింత స‌మాచారం అందాల్సి ఉంది.

Also Read: అతిపెద్ద న‌గ‌రంగా హైద‌రాబాద్ అభివృద్ది సంతోషం: కూనంనేని సాంబ‌శివ‌రావు

Leave A Reply

Your email address will not be published.