గిల్ డబుల్ సెంచరీ.. కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన శుభ్‌మన్ గిల్
Gill: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ చేశాడు. 387 బంతుల్లో 30ఫోర్లు, 3 సిక్స్‌లు బాది,269 పరుగులు సాధించాడు. దీంతో గిల్ అనేక రికార్డులు సాధించాడు. ఇంగ్లాండ్ లో అత్యధిక స్కోర్ చేసిన టీమ్ ఇండియా కెప్టెన్‌గా గిల్ ఘనత సాధించారు. ఇంతకు ముందు అజహరుద్దీన్ పేరు మీద ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. 1990లో ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో అజహరుద్దీన్ 179 పరుగులు చేశాడు.
విరాట్ కోహ్లీ కూడా 2016లో పుణె వేదికగా డబుల్ సెంచరీ 254 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీని అధికమించి టెస్టుల్లో అత్యధిక స్కోర్ చేసిన భారత క్రికెటర్‌గా గిల్ రికార్డు కెక్కాడు.