ఈ స్ట్ హిమాలయాల్లో 5 కొత్త కప్పలు!
సూక్ష రకాల కప్పల జాతులను గుర్తించిన శాస్త్రవేత్తలు
ఈటానగర్ (CLiC2NEWS): కొత్తదనానికి, ప్రశాంతతకు పెట్టింది పేరు హిమాలయాలు.. ఈ మంచుకొండల్లో ఎన్నోవింతలు.. ఇక్కడి దట్టమైన అడవులు ఎన్నో వింత జీవిలకు నెలవు. ఈ మధ్య కాలంలో తూర్పు హిమాలయాల్లోని ఈ ఆరణ్యాల్లో ఢిల్లీ యూనివర్సిటీ, హార్వార్డ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఐదు రకాల కొత్త సూక్ష్మ కప్ప జాతులను గుర్తించారు. ఈపరిశోధనకు సంబంధించిన వివరాలను `రాయల్ సొసైటీ ఓపెన్ సైన్స్` జర్నల్ లో ప్రచురించారు.
ఈ అరుదైన జాతికి చెందిన కప్పలు `జింగోఫ్రిస్` సమూహానికి సంబంధించినవి అని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ కప్పలకు పేర్లను కూడా సూచించారు. వీటికి జింగోఫ్రిస్ టానిటాటి, జింగోఫ్రిస్ టానోగోగో, సియాంగెన్సిస్, హెర్టీ, ఉలార్సొని అనే పేర్లను పెట్టారు.
వీటిలో జింగోఫ్రిస్ టానోగోగో అనే కప్ప ప్రత్యేక నత్తలను మాత్రమే ఆహారంగా తీసుకొంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇది భారత్ లో నత్తలను తినే కప్పగా మొదటిసారి గుర్తింపు పొందిందని తెలిపారు.
Also Read: తిమ్మిని బమ్మి చేసే యానిమేషన్!