రూ. 53 ల‌క్ష‌ల జాక్‌పాట్ కొట్టిన నాలుగేళ్ల ల‌క్కీబాయ్‌

బుర్మ‌న్‌పూర్‌(CLiC2NEWS): న‌క్క‌తోక తోక తొక్క‌డ‌మంటే ఇదేనేమో.. అదృష్టం ఎప్పుడు ఎవ‌రిని వ‌రిస్తుందో ఊహించ‌డం క‌ష్ట‌మే.. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని బుర్మ‌న్‌పూర్ ప్రాంతంలోని సిలంపుర‌కు చెందిన ఓ బాలుడికి ఊహించ‌ని అదృష్టం వ‌రించింది. నాలుగేళ్ల మేధాంశ్‌కు లాట‌రీలో ఏకంగా రూ. 53 ల‌క్ష‌ల విలువైన ఫార్చ్యూన‌ర్ కారు త‌గిలింది.

అక్క‌డ స్థానికంగా నిర్వ‌హించే గ‌ర్భా ఉత్స‌వంలో భాగంగా శ్రీ స‌ర్కార్ ధామ్ అనే వ్యక్తి నిర్వ‌హించిన లాట‌రీలో మేధాంశ్ ను అదృష్టం వ‌రించింది. ఈ లాట‌రీ టిక్కెట్‌ను కిర‌ణ్ రాయ్ క‌ర్ అనే వ్య‌క్తి త‌న మ‌న‌వ‌డైన మేధాంశ్ పేరు మీద కొన్నాడు. కేవ‌లం రూ. 201 పెట్టి టిక్కెట్ కొంటే ఏకంగా రూ. 53 ల‌క్ష‌ల విలువైన లాట‌రీ త‌గ‌లడంతో అంత‌టా ఈ విష‌య‌మే చ‌ర్చించుకుంటున్నారు. దీంతో సిలంపుర‌లో అంద‌రూ మేధాంశ్‌ను ల‌క్కీ బాయ్ అంటూ మెచ్చ‌కుంటున్నారు.

Also Read : జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్య‌ర్థిగా న‌వీన్ యాద‌వ్‌

Leave A Reply

Your email address will not be published.