జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్య‌ర్థిగా న‌వీన్ యాద‌వ్‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ‌లో ఉప ఎన్నిక వేడి మొద‌లైంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించింది. బుధ‌వారం రాత్రి వి. న‌వీన్ యాద‌వ్ పేరును అధికారికంగా ఎఐసిసి విడుద‌ల చేసింది.

భార‌త రాష్ట్ర స‌మితి (బి ఆర్ ఎస్‌) త‌రుపున గ‌తంలో ఇక్క‌డి నుంచి గెలిచిన మాగంటి గోపీనాథ్ (62) మృతితో జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక జ‌రుగ‌నుంది. కాగా ఇప్ప‌టి కే బిఆర్ ఎస్ పార్టీ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడా అభ్య‌ర్థిని ప్ర‌కటించింది. కాగా ప్ర‌స్తుత కాంగ్రెస్ అభ్య‌ర్థి న‌వీన్ యాద‌వ్ గ‌తంలో ఇక్క‌డ నుంచి ఎంఐఎం త‌ర‌ఫున పోటీ చేసి ఓడిపోయాడు. అనంత‌రం కాంగ్రెస్ పార్టీలో చేరి తాజాగా ఇక్క‌డి నుంచి అసెంబ్లీ అభ్య‌ర్థిగా టిక్కె్ట్‌ ద‌క్కించుకున్నాడు.

Also Read: అనుమ‌తివ్వండి బాధితుల‌ను క‌లుస్తా: విజ‌య్‌

1 Comment
  1. […] Also Read : జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్య‌ర్థిగా … […]

Leave A Reply

Your email address will not be published.