TS: 32 శాఖల్లోని వివరాలు ఆర్థికశాఖ చెంతకు
ఉద్యోగాల భర్తీలో కీలక అడుగు
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి వడివడిగా అడుగులు పడుతున్నాయి. వివిధ శాఖల వారీగా పోస్టుల లెక్కలను అధికారులు బయటకు తీస్తున్నారు. ఉద్యోగ ఖాళీలపై ఆర్థికశాఖ ప్రత్యేకంగా అన్ని శాఖల కార్యదర్శులు, హెచ్‌వోడీలతో ఆదివారం ఎంసీహెచ్‌ఆర్డీలో సమావేశం నిర్వహించింది. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
32 ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల వివరాలను ఆయా శాఖల కార్యదర్శులు, హెచ్‌వోడీలు ఆర్థికశాఖకు అందించారు. ఇ వివరాలు అన్నీ ఆర్థికశాఖ మంగళవారం జరిగే మంత్రివర్గ బేటీ ముందుంచనున్నది. తెలంగాణ సిఎం కెసిఆర్ 50 వేల ఉద్యోగాలను భర్తీచేస్తామని ఇటీవల ప్రకటించటంతో పోస్టుల భర్తీపై కొంతకాలంగా శాఖలవారీగా కసరత్తు జరుగుతున్నది.
కాగా అధికారులు అందించే నివేదికపై క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత పోస్టుల భర్తీకి సంబంధించిన వివరాలను టీఎస్‌పీఎస్సీకి అందిస్తారు. ఆ వెంటనే ఉద్యోగాల భర్తీకి కమిషన్ వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తుంది.
కొత్త జోనల్ వ్యవస్థ అమలులోకి రావటంతో ఉద్యోగాల భర్తీకి అడ్డంకులు తొలగిపోయాయి. ఓపెన్ కోటాలో స్థానికేతరులు వచ్చి చొరబడతారన్న భయం పోయింది.