TS Corona: కొత్తగా 465 కేసులు
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో కరోనా కేసులు తగ్గు ముఖం పట్టాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా 65,607 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 465 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం కరోనా బులిటెన్ విడుదల చేసింది.
- తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6,31,683కు చేరింది.
- తాజాగా ఇవాళ (ఆదివారం) నలుగురు మరణించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 3,729కి పెరిగింది.
- గడిచిన 24 గంటల వ్యవధిలో 869 మంది కోలుకున్నారు.
- ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 6,17,638కి చేరింది.
- ప్రస్తుతం రాష్ట్రంలో 10,316 యాక్టివ్ కేసులు ఉన్నాయి.