గోట్ క‌ప్: మెస్సీ జ‌ట్టుపై సింగ‌రేణి ఆర్ఆర్ జ‌ట్టు విజ‌యం..

హైద‌రాబాద్ (CLiC2NEWS): ఉప్ప‌ల్ వేదిక‌గా జ‌రిగిన ప్రెండ్లీ పుట్ బాల్ మ్య‌చ్‌లో మెస్సి జ‌ట్టుపై 3-0 గోల్స్‌తో సెంగ‌రేణి ఆర్ ఆర్ జ‌ట్టు విజ‌యం సాధించింది. అర్జెంటీనా పుట్ బాల్ దిగ్గ‌జం లియోనెల్ మెస్సి.. గోట్ టూర్ ఆఫ్ ఇండియా లో భాగంగా హైద‌రాబాద్‌లోని ఉప్ప‌ల్ స్టేడియంలో సంద‌డి చేశారు. గోట్ క‌ప్ పేరుతో నిర్వ‌హించిన ఎగ్జిబిష‌న్ పుట్ బాల్ మ్యాచ్‌లో   సిఎం రేవంత్ రెడ్డితో క‌లిసి లియెనెల్ మెస్సి  ఆడారు.. అనంత‌రం విన్న‌ర్‌, ర‌న్న‌ర‌ప్‌ల‌కు మెస్సి, సిఎం , రాహుల్ గాంధీ ట్రోఫీలు అందించారు. ఈ సంద‌ర్బంగా మెస్సి మాట్లాడుతూ.. హైద‌రాబాద్ వ‌చ్చి తెలుగు ప్ర‌జ‌ల‌ను క‌ల‌వ‌డం సంతోషంగా ఉంద‌న్నారు.

శ‌నివారం ఉద‌యం కోల్‌క‌త్తా చేరుకున్న మెస్సి.. ఉద‌యం లేక్‌టౌన్లో త‌న 70 అడుగుట విగ్రహాన్ని బాలీవుడ్ న‌టుడు షారుక్‌ఖాన్‌తో క‌లిసి వ‌ర్చువ‌ల్‌గా ఆవిష్క‌రించారు. గోట్ టూర్ ఆఫ్ ఇండియా లో భాగంగా మెస్సి.. కోల్‌క‌తా, హైద‌రాబాద్‌, ముంబ‌యి, ఢిల్లీలో ప‌ర్య‌టించనున్నారు.

Also Read: మెద‌క్: రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

Leave A Reply

Your email address will not be published.