హైదరాబాద్‌లో గంటపాటు భారీ వర్షం.. వాతావరణశాఖ హెచ్చరిక

హైదరాబాద్‌ (CLiC2NEWS): హైదరాబాద్ న‌గ‌రంలో రానున్న గంట స‌మ‌యం పాటు మోస్తారు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. న‌గ‌ర వాసులు ఇళ్ల‌లోనే ఉండాల‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లోనే బ‌య‌ట‌కు రావాల‌ని న‌గ‌ర వాసుల‌కు సూచించింది.

కాగా ఇప్ప‌టికే సికింద్రాబాద్‌లోని ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురుస్తోంది. ముషీరాబాద్‌, భోలక్‌పూర్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్డు, చిక్కడపల్లిలో, రాంనగర్‌, కవాడిగూడ, ఇందిరాపార్క్‌, దోమలగూడ, విద్యానగర్‌, అడిక్‌మెట్‌లో వర్షం కురుస్తోంది. ప్యాట్నీ, పార‌డైస్‌, అల్వ‌ల్ ప్రాంతాల్లో భారీ వ‌ర్షం మొద‌లైంది. న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో మోకాలిలోతు నీరు చేర‌డంతో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. అలాగే మేడ్చల్‌, మల్కాజ్‌గిరి, కుత్బుల్లాపూర్‌ ప్రాంతాల్లో కూడా భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది.

Leave A Reply

Your email address will not be published.