హైదరాబాద్ -బెళగావి స్పెషల్ ట్రైన్‌కు తప్పిన ప్రమాదం..
హైదరాబాద్ (CLiC2NEWS): హైదరాబాద్ -బెళగావి ప్రత్యేక రైలు బోగీకి మంటలు అంటుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన రైల్వేసిబ్బంది కారణంగా పెను ప్రమాదం తప్పింది. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి రైల్వేస్టేషన్‌కు సమీపంలో హైదరాబాద్ నుండి కర్ణాటకలోని బెళగావి వెళుతున్న (07043) ప్రత్యేక రైలు మొదటి జనరల్ బోగీకి మంటలు వ్యాపించాయి. బ్రేక్‌జామ్ కావడంతో నిప్పురవ్వలు చెలరేగి మంటలు అంటుకున్నట్లు సమాచారం. వెంటనే ప్రయాణికులు రైల్వేసిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే మంటలు ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది. అనంతరం రైలు బయల్దేరింది.
Also Read: Anakapalli: పట్టపగలే బ్యాంకు దోపిడీకి ప్రయత్నించిన దుండగులు
[…] Also Read: హైదరాబాద్ -బెళగావి స్పెషల్ ట్రైన్… […]