IDFC: ఉన్నత చదువులు చదవాలనుకునే పేద విద్యార్థులకోసం స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్..
IDFC: ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంకు ఎంబిఎ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2025.. ఉన్నత చదువులు చదవాలనుకునే పేద విద్యార్థులకు ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంకు స్కాలర్‌షిప్‌లను అందజేస్తుంది. అర్హులైన ఎంబిఎ విద్యార్థులకు ఏడాదికి రూ. లక్ష చొప్పున రూ.2లక్షల వరకు ఈ స్కాలర్‌షిప్‌ను ఐడిఎఫ్‌సి అందిస్తుంది. దేశంలోని 24 రాష్ట్రాల్లో ని విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌కు మొత్తం 700 మందిని ఎంపిక చేయటం జరుగుతుంది. అర్హులైన వారు జులై 20వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.
ఈ స్కాలర్‌షిప్ దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంకు సూచించిన విద్యాసంస్థల్లో 2025-27 విద్యా సంవత్సరం రెండేళ్ల ఫుల్‌టైం ఎంబిఎ కోర్సులో మొదటి ఏడాది అడ్మిషన్ పొంది ఉండాలి.
దరఖాస్తులను ఐడిఎఫ్‌సి బ్యాంకు వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి. అడ్మిషన్ ఫారమ్, ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీ రిసిప్ట్ , ఆదాయ, జనన ధ్రువీకరణ పత్రం తదితరాలు అప్‌లోడ్ చేయాలి. పూర్తి వివరాలకు mbascholarship@idfcfisrtbank.com వెబ్‌సైట్ చూడగలరు.
విద్యార్థి కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.6లక్షలకు మించకూడదు.
విద్యార్థుల వయస్సు 35 ఏళ్లకు మించకూడదు.