విశాఖ: పెట్రోలియం కంపెనీపై పిడుగు..  భారీ ఎత్తున‌ మంట‌లు 

విశాఖ (CLiC2NEWS): ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్రంలో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఈ క్ర‌మంలో విశాఖ‌లో ఈస్ట్ ఇండియా పెట్రోలియం కంపెనీపై పిడుగు ప‌డింది. దీంతో భారీ ఎత్తున మంట‌లు చెల‌రేగాయి. పెట్రోల్ ఫిల్ట‌ర్ ట్యాంక్‌పై పిడుగు ప‌డ‌టంతో ఒక్క‌సారిగా మంట‌లు అంటుకున్నాయి. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని మంట‌ల‌ను అదుపులోకి తెచ్చారు. ప్ర‌స్తుతానికి ఎలాంటి ప్ర‌మాదం లేద‌ని అధికారులు తెలిపారు. ఎపి హోంమంత్రి అనిత అగ్నిప్ర‌మాద ఘ‌ట‌న గురించి అగ్నిమాప‌క శాఖ‌  అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. ఉన్న‌తాధికారుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో కొన‌సాగుతుందని వెల్ల‌డించారు.

 

AP: ఈ నెలాఖ‌రు వ‌ర‌కు వ‌ర్షాలు..!

Leave A Reply

Your email address will not be published.