India Corona: మళ్లీ 4వేలపైనే మరణాలు
న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకు దేశంలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 3,62,727 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ విడుదల చేఇసంది. ఇప్పటి వరకు దేశంలో మొత్తంనమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,37,03,665 కి చేరింది. ఇందులో 1,97,34,823 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యరు. ప్రస్తుతం 37,10,525 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.
ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో 4,120 మంది మృతి చెందారు. దీంతో 1దేశంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,58,317కి చేరింది. ఇక 24 గంటల్లో 3,52,181 మంది కరోనా నుంచి కోలుకున్నారు.