TS LockDown: భూముల రిజిస్ట్రేషన్లకు తాత్కాలిక బ్రేక్!
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో 10 రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తూ రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే కార్యకలాపాలకు అనుమతి ఇచ్చారు. లాక్ డౌన్ నిబంధనల వలన భూముల రిజిస్ట్రేషన్లకు తాత్కాలిక బ్రేక్ పడింది. వివిధ మండల కార్యాలయాలలో జాయింట్ సబ్ రిజిస్టార్ లుగా వ్యవహరిస్తున్న తహసిల్ దార్ల వద్ద ధరణీ ద్వారా నిర్వహించే భూముల రిజిస్ట్రేషన్లు, ఇతర లావాదేవీలు ఈ నెల 12 నుండి 21వ తేది వరకు జరుగవని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఒక ప్రకటన లో తెలిపారు. అయితే ఈ నెల 12 నుండి 21వ తేదీలలో రిజిస్ట్రేషన్ లకు ధరణీ ద్వారా స్లాట్ లు బుక్ చేసుకున్న వారి స్లాట్ లను రీషెడ్యూల్ చేయనున్నట్లు తెలిపారు. స్లాట్ ల బుకింగ్ కై చెల్లించిన రిజిస్ట్రేషన్ ఫీజులు, ఇతర చార్జీలు చెల్లుబాటు అవుతాయని, రీషెడ్యూల్ సమయంలో వాటిని జమ చేయనున్నట్లు చెప్పారు.