India Corona: భారీగా తగ్గిన కరోనా కేసులు..
న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా సెకండ్ వేవ్ కేసులు భారీగా తగ్గాయి. చాలా రోజుల తర్వాత తాజాగా కొత్త కేసులు రెండు లక్షల దిగువకు చేరడం ఊరట కలిగిస్తోంది. కానీ మరణాలు మాత్రం ఆందోళనకరంగానే ఉన్నాయి.
గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,96,427 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు మంగళవారం కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ కరోనా బులిటెన్ విడుదల చేసింది. ఏప్రిల్ 14 తర్వాత ఇంత తక్కువగా కేసులు నమోదవడం ఇదే తొలిసారి.
కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,69,48,874కు చేరింది. గడిచిన 24 గంటల వ్యవధిలో తాజాగా 3,511 మంది వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు 3,07,231 మంది వైరస్ బారినపడి మృతి చెందారు. 24 గంటల్లో 3,26,850 బాధితులు డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు దేశంలో 2,40,54,861 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 25,86,782 యాక్టివ్ కేసులు ఉన్నాయి.