TS: ఇంట‌ర్ ప్రాక్టిక‌ల్ ప‌రీక్ష‌లు య‌థాత‌థం..

హైద‌రాబాద్ (CLiC2NEWS): ఇంట‌ర్ ప్రాక్టిక‌ల్స్ ప‌రీక్ష‌లు ర‌ద్దు చేసే ఆలోచ‌న లేద‌ని ఇంట‌ర్ బోర్టు స్ప‌ష్టం చేసింది. గ‌త విద్చాసంవ‌త్స‌రంలో ప్ర‌త్య‌క్ష త‌ర‌గ‌తులు 45 రోజులే జ‌ర‌గ‌టం వ‌ల‌న ప్రాక్టిక‌ల్స్ నిర్వ‌హిచ‌కుండా మార్కులు వేయాల్సి వ‌చ్చింది. కాని ఈఏడాది జూన్‌లోనే ఆన్‌లైన్ త‌ర‌గ‌తులు, సెప్టెంబ‌రు నుండి ప్ర‌త్య‌క్ష త‌ర‌గ‌తులు నిర్వ‌హించ‌డం జ‌రుగుతోంది. కాబ‌ట్టి వార్షిక ప‌రీక్ష‌లు కూడా య‌థాత‌థంగా జ‌రుగుతాయని ఇంట‌ర్ బోర్డు కార్య‌ద‌ర్శి స‌య్య‌ద్ ఉమ‌ర్ జ‌లీల్ తెలిపారు.

ఒమిక్రాన్ ప్ర‌భావంతో కేవ‌లం 14 రోజులే క‌ళాశాల‌లు మూత‌ప‌డ్డాయ‌ని, ఫిబ్ర‌వ‌రి 1వ తేదీనుండి ప్ర‌త్య‌క్ష త‌ర‌గ‌తులు జ‌రుగుతున్నాయ‌న్నారు. దీంతో ప్రాక్టిక‌ల్స్ కూడా ఎప్ప‌టిలాగే వార్షిక పరీక్ష‌ల‌కు ముందే నిర్వ‌హిస్తామ‌ని పేర్కొన్నారు. విద్యార్థులు ఎటువంటి క‌న్ఫ్యూజ‌న్‌కు గురికావ‌ద్ద‌ని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.