India Corona: భారీగా తగ్గిన కేసులు.. మరణాలు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత తగ్గుముఖం ప‌డుతోంది. రోజువారీ కేసులతో పాటు మరణాలు కూడా దిగి వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 37,566 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేర‌కు కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది.

  • కొత్గా 56,994 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 2,93,66,601 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు.
  • కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,03,16,897కు పెరిగింది.
  • గ‌డిచిన 24 గంటల్లో 907 మరణాలు నమోదయ్యాయి.
  • ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో బారినపడి మొత్తం 3,97,637 ప్రాణాలు కోల్పోయారు.
  • ప్రస్తుతం దేశంలో 5,52,659 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆరోగ్యశాఖ పేర్కొంద‌.
Leave A Reply

Your email address will not be published.