ఇండిగో ఎయిర్‌లైన్స్: రూ. 2వేలకే విమాన టిక్కెట్..
గురుగ్రామ్ (CLiC2NEWS): ప్రముఖ విమానయాన సంస్థ ‘ఇండిగో’.. విమాన టిక్కెట్‌లపై ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. వింటర్ స్పెషల్ ఆఫర్ కింద దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై తగ్గింపు ధరకు టికెట్లు అందించనుంది. నేటి నుండి మూడు రోజుల పాటు ఈ ప్రత్యేక ఆఫర్ అందుబాటులో ఉంటుంది. దేశీయ ప్రయాణానికి రూ.2,203, అంతర్జాతీయ ప్రయాణాలకు రూ. 4,999 నుండి ప్రారంభ టికెట్ల ధరగా నిర్ణయించింది. 2023 జనవరి 15వ తేదీ నుండి ఏప్రిల్ 14వ తేదీ మధ్య ప్రయాణానికి ఈ టికెట్లు అభిస్తాయిన ఇండిగో సంస్థ ప్రకటనలో తెలిపింది.
విమానయాన రంగం మునుపటికంటే పుంజుకుందని.. దీన్ని సెలబ్రేట్ చేసుకోవడంలో భాగంగా ఈ స్పెషల్ ఆఫర్ తెచ్చినట్లు ఇండిగో గ్లోబల్ సేల్స్ హెడ్ వినయ్ మల్హోత్రా తెలిపారు. హాలిడేలలో ప్రయాణాలకు ఎక్కువ ఆసక్తి కనబరుస్తారని, నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్న తరుణంలో వింటర్ సేల్‌ను తీసుకువచ్చినట్లు సమాచారం.
Your article helped me a lot, is there any more related content? Thanks!