తెలంగాణ‌లో గ్రూప్‌-4 ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ వాయిదా..

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్‌-4 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌లైన విష‌యం తెలిసిన‌దే. మొత్తం 25 ప్ర‌భుత్వ విభాగాల‌కు చెందిన 9,168 పోస్టుల‌ను టిఎస్‌పిఎస్‌సి ద్వారా భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ ఉద్యోగాల‌కు ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ నేటి నుండి ప్రారంభం కావాల్సి ఉండ‌గా.. సాంకేతిక కార‌ణాల‌తో వాయిదా వేసిన‌ట్లు టిఎస్‌పిఎస్‌సి ప్ర‌క‌టించింది. అదేవిధంగా కొత్త తేదీల‌ను వెల్ల‌డించింది. డిసెంబ‌ర్ 30వ తేదీ నుండి జ‌న‌వ‌రి 19వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్న‌ట్లు తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.