సాయి ప‌ల్ల‌వికి `క‌లైమామ‌ణి`

చెన్నై (CLiC2NEWS): త‌మిళ‌నాడు రాష్ట్ర స‌ర్కార్ క‌లైమామ‌ణి పుర‌స్కారాలు శ‌నివారం అంద‌జేసింది. 2021, 2022, 2023 సంవ‌త్స‌రాల‌కు సంబంధించి క‌ళారంగంలో విశేష కృషి చేసిన వారికి త‌మిళ‌నాడు రాష్ట్ర సర్కార్ ఈ అవార్డుల‌ను అంద‌జేసింది. దాదాపు 90 పుర‌స్కారాల‌ను విజేత‌ల‌కు అంద‌జేసింది.

చెన్నైలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి స్టాలిన్ ప‌లువురు సినీ ప్రముఖులు హాజ‌ర‌య్యారు. 2021 సంవ‌త్స‌రానికి గాను న‌ట‌నా విభాగంలో ప్ర‌ముఖ న‌టి సాయిప‌ల్ల‌వికి క‌లైమామ‌ణి అవార్డును సిఎం స్టాలిన్ అంద‌జేశారు. విజేత‌ల్లో న‌టులు ఎస్ జె సూర్య‌, విక్ర‌మ్ ప్ర‌భు త‌దిత‌రులు ఉన్నారు.

Also Read: భార్య వెళ్లిపోయింద‌నే అక్క‌సుతో ముగ్గురు పిల్ల‌ల్ని చంపేసిన తండ్రి

1 Comment
Leave A Reply

Your email address will not be published.