TS: కాంగ్రెస్‌కు మరో షాక్.. పార్టీకి కౌశిక్ రెడ్డి రాజీనామా
హైదరాబాద్ (CLiC2NEWS): హుజూరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి సోమవారం పాడి కౌశిక్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ కు తాను రాజీనామా చేస్తున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎంఎల్ఎ పదవికి రాజీనామా చేయడంతో హుజూరాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. దీంతో అన్ని పార్టీలు హుజూరాబాద్ ఉప ఎన్నిక పోరుకు సిద్ధమవుతున్నాయి. హుజురాబాద్ నుంచి అధికారపార్టీ తరఫున ఎవరిని నిలబెట్టాలని టిఆర్ఎస్ తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ లో చేరనున్నారని తెలిసింది.

కాంగ్రెస్ పార్టీ కి ఇదేం పెద్ద షాక్ కాదు…
తన భవిష్యత్‌ను నాశనం చేసుకున్నాడు…
గొర్రెల మందలో చేరిన మరో గొర్రె….