ఇంటి దొంగలను వదిలిపెట్టేది లేదు: రేవంత్ రెడ్డి
హైదరాబాద్ (CLiC2NEWS): కాంగ్రెస్ పార్టీలో ఇంటి దొంగలను వదిలేది లేదని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. నిర్మల్‌లో పెట్రోధరలను నిరసిస్తూ నిర్వహించిన నిరసన ర్యాలీలో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాల్గొన్నాడు. ఈ సంందర్భంగా అంబేడ్కర్ చౌక్‌లో నిర్వహించిన నిరసన సభలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ కోసం కష్టపడే వారిని వదులుకునేది లేదని ఆయన తెలిపారు.
రేవంత్ రెడ్డి, కౌశిక్ రెడ్డి రాజీనామాపై స్పందించారు. టీఆర్‌ఎస్‌తో కుమ్మక్కై కౌశిక్ రెడ్డి కోవర్ట్‌గా మారారని విమర్శించారు. కాంగ్రెస్‌లో ఇంటి దొంగలను విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు. నెలాఖరు వరకు కాంగ్రెస్ ఇంటి దొంగలకు రేవంత్ రెడ్డి డెడ్‌లైన్ విధించారు.