Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతికి గవర్నర్ తొలిపూజ
హైదరాబాద్ (CLiC2NEWS): దేశవ్యాప్తంగా గణేష్ చతుర్ధి ఉత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. హైరదాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా వీధివీధినా గణనాథుడు కొలువుదీరాడు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా గణేశుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గణనాథుడి మండపాలను అందంగా ముస్తాము చేశారు.
హైదరాబాద్లోని ఖైరతాబాద్ గణేశుడికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తొలిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.
69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పతో తీర్చిదిద్దిన బడా గణపతిని దర్శంచుకునేందు హైదరాబాద్ వాసులు భారీగా తరలివస్తున్నారు. ఒకపక్క వర్షం కురుస్తున్నా… భక్తుల తాకిడి మాత్రం విపరీతంగా ఉంది.
Also Read: Happy Ganesh Chaturthi: వినాయకచవితి శుభాకాంక్షలు

[…] […]